ఆటా ఆధ్వర్యంలో మహిళలకు అందాల పోటీలు

అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఆటా 17వ కన్వెన్షన్ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో వర్జీనియాలోని స్టెర్లింగ్‌లో ఏప్రిల్ 24న ఇండోర్ గేమ్‌లను నిర్వహించారు. ఈ వినోదభరితమైన పోటీలలో చిన్న, పెద్ద అని తేడా లేకుండా 150 మందికి పైగా మహిళలు ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. మహిళా విభాగం చైర్ దీపికా బూజాల, శీతల్, ప్రశాంతి ముత్యాల, శ్వేత ఇమ్మడి, స్రవంతి, కరుణ గంగాధర్‌లు అందరికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీఠ వేస్తూ నిర్వహించబోయే ప్రారంభోత్సవ నృత్య రూపకంలో పాలు పంచుకునేందుకు మహిళలు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
ఆటా కాన్ఫరెన్స్ మహిళా విభాగం చైర్ అపర్ణ కదిరి, ఉత్సాహవంతులైన మహిళలందరూ రాబోయే పోటీలు మరియు క్రీడల కోసం నమోదు చేసుకోవాలని అభ్యర్థించింది. ఆటా కన్వెన్షన్ టీమ్ కాన్ఫరెన్స్‌లో భాగంగా రాబోయే కొద్ది నెలల్లో అమెరికా నలు చెరుగుల జుమ్మంది నాధం (పాటల పోటీలు), సయ్యంది పాదం (డ్యాన్స్ పోటీలు), అందాల పోటీలు మరియు మరిన్ని వినూత్నమైన ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జూలై 1-3, 2022న వాషింగ్టన్‌డిసిలో జరిగే కాన్ఫరెన్స్‌లో ఫైనల్స్ నిర్వహిస్తారు. ఆసక్తిగల మహిళలందరూ అందాల పోటీకి నమోదు చేసుకోవాలని స్థానిక కోఆర్డినేటర్ వినయ అభ్యర్థించారు. అందాల పోటీలలో పాల్గొనే మహిళలు అందరికి క్యాట్ వాక్, న్యూట్రిషన్ తదితర విషయాలలో వర్చ్యువల్ గా ద్వారా తర్ఫీదు ఇస్తారు. ఈ అందాల పోటీలు రాష్ట్రాల్లో నిర్వహించబడుతుంది. ఫైనల్స్ జూలై 1- 3 వాషింగ్టన్ %ణజ% లో జరగనున్న కన్వెన్షన్‌లో నిర్వహించబడతాయి. స్పోర్ట్స్ కో-చైర్‌లు శీతల్ మరియు ప్రశాంతి ముత్యాల ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా విజయవంతం చేసినందుకు వాలంటీర్లు మరియు పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.