చైనాలో కరోనా కలకలం..

చైనాలో కరోనా కలకలం..

చైనాలో డెల్టా రకం కరోనా మహమ్మారి కలకలం రేపుతున్నది. దేశంలోని పలు ప్రాంతాల్లో డెల్టా వేరియంట్‌ శరవేగంగా విస్తరిస్తున్నది. చైనాలోని మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే బీజింగ్‌లో కేసులు  ఎక్కువగా ఉండడంతో కొన్ని ఏరియాల్లో బీజింగ్‌ నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధించారు. కరోనా నెగెటివ్‌ రిపోర్ట్‌ ఉంటేనే బీజింగ్‌ నుంచి వచ్చేవారిని తమ ప్రాంతంలోకి అనుమతిస్తున్నారు. చైనా మెయిన్‌ లాండ్‌లో అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌  14 వరకు మొత్తం 1,308 మందిలో కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటి వరకు మొత్తం 1,280 డెల్టా రకం కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాలోని 21 ప్రావిన్స్‌లు, రీజియన్‌లు, మున్సిపాలిటీల్లో డెల్టా వేరియంట్‌ ప్రభావం ఉన్నది.

 

Tags :