అమెరికాపై ఆధారపడితే.. ఎప్పుడైనా ఎదురుదెబ్బ

అమెరికాపై ఆధారపడితే.. ఎప్పుడైనా ఎదురుదెబ్బ

ప్రభుత్వ కార్యాలయాలు, ఏజెన్సీల్లో ఉన్న కోట్లాది అమెరికా కంప్యూటర్లను పక్కన పెట్టేయాలని చైనా నిర్ణయించింది. కీలక విభాగాల్లో విదేశీ టెక్నాలజీ వినియోగాన్ని పూర్తిగా తుడిచిపెట్టే దిశగ అడుగులు వేస్తోంది. అమెరికాపై ఆధారపడితే ఆంక్షల రూపంలో ఎప్పుడైనా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రెండేళ్లలోపు స్థానిక ప్రత్యామ్నాయాలతో వీటిని భర్తీ  చేయాలని సూచించింది. చైనా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని కనీసం 5 కోట్ల కంప్యూటర్లను కచ్చితంగా  తొలగించాల్సి ఉంది. మరో రెండేళ్లలో ఫ్రావిన్స్‌ల్లోని ప్రభుత్వాలు కూడా దీన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవచ్చు.

 

Tags :