ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ

ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్‌టీ బకాయిలు సహా పలు కీలక అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, రాష్ట్ర మాజీ మంత్రి పార్థ చటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసిన కొద్ది రోజుల్లోనే మోదీతో భేటీ అవటంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నీతి అయోగ్‌ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ  పర్యాటనకు వెళ్లారు మమత. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూతో సైతం సమావేశం కానున్నారు. మమత బెనర్జీ ఢిల్లీ టూర్‌లో ప్రధాని, రాష్ట్రపతితో భేటీ బెంగాల్‌ బీజేపీ, టీఎంసీల మధ్య కీలక అంశంగా మారింది. 7వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరవనున్నారు మమతా బెనర్జీ. నీతి అయోగ్‌ కౌన్సిల్‌ మీటింగ్‌కు ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయం, ఆరోగ్యం,  ఆర్థిక అంశాలపై చర్చించనున్నారని సమాచారం.

 

Tags :