దాని వల్లే ఇప్పుడు భద్రాచలం సురక్షితం

దాని వల్లే ఇప్పుడు భద్రాచలం సురక్షితం

భద్రాచలంలో వరద ముప్పు నుంచి ప్రజల్ని కాపాడేందుకు టీడీపీ హయాంలో 20 ఏళ్ల క్రితం కరకట్ట నిర్మించామని, దాని వల్లే ఇప్పుడు పట్టణమంతా సురక్షితంగా ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ, తెలంగాణ సరిహద్దులోని విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా గుర్తుపెట్టుకునే విధంగా అప్పట్లో కరకట్ట నిర్మించామన్నారు. ఇటీవల భారీగా వరద వచ్చినా కరకట్ట ఉండటంతోనే భద్రాచలం ప్రజలంతా ధైర్యంగా నిద్రపోగలిగారని చెప్పారు. వరద కరకట్ట పై వరకూ వచ్చిందని, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాలన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. భద్రాచలం పక్కనే ఉన్న ఐదు ముంపు గ్రామాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. మనం చేసే అభివృద్ధి, సామాజిక సేవే శాశ్వతంగా ఉంటాయని చెప్పారు.

 

Tags :