మహారాష్ట్ర గవర్నర్ సంచలన ప్రకటన

మహారాష్ట్ర గవర్నర్ సంచలన ప్రకటన

మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ సంచలన విషయాన్ని ప్రకటించారు. రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలిపానని వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో త్వరలోనే ఆయన గవర్నర్‌ పదవికీ రాజీనామా  చేయనున్నట్లు తెలుస్తోంది.  సంఘ సంస్కర్తలు, వీర యోధులు పుట్టిన గడ్డ మహారాష్ట్ర లాంటి గొప్ప రాష్ట్రానికి రాజ్య సేవకుడి (గవర్నర్‌)గా సేవలందించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ మూడేళ్లలో రాష్ట్ర  ప్రజలు నాపై చూపించిన ప్రేమ, అభిమానాన్ని నేను ఎన్నటికీ మర్చిపోను. ఇటీవల ప్రధాని మోదీ ముంబయి పర్యటనకు వచ్చిన సమయంలో ఆయనతో ఓ విషయాన్ని పంచుకున్నా. అన్ని రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్లు తెలిపారు.  నా శేష జీవితాన్ని పుస్తకాలు చదవడం, రాయడం, ఇతర వ్యాపకాలతో గడపాలనుకుంటున్నా.. ప్రధాని మోదీ నాపై ఎప్పుడూ అభిమానం చూపిస్తారు. ఈ విషయంలోనూ అలాగే స్పందిస్తారని ఆశిస్తున్నా అని కోశ్యారీ వెల్లడించారు. 

 

 

Tags :