టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు ...భారత్ బయోటెక్ 2 కోట్లు విరాళం

టీటీడీ  అన్నప్రసాదం ట్రస్టుకు  ...భారత్ బయోటెక్ 2 కోట్లు విరాళం

కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)  శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి విచ్చేసే భక్తులకు నిరంతరాయంగా రుచిగా అన్నప్రసాదం అందిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్‌కు 2 కోట్ల రూపాయలు విరాళమిచ్చారు. భారత్‌ బయోటెక్‌ సంస్థకు చెందిన కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్ల ఇరువురూ 2 కోట్లు రూపాయలు డిడిలను విరాళాల రూపంలో టీటీడీ పాలకమండలి చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు దాతలకు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.

Tags :