గత ప్రభుత్వాల హయాంలో రాని సమస్య ఇప్పుడెందుకు ?

గత ప్రభుత్వాల హయాంలో రాని సమస్య ఇప్పుడెందుకు ?

వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వాల హయాంలో రాని సమస్య ఇప్పుడెందుకు వచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పబ్లిక్‌ గార్డెన్స్‌ నుంచి వ్యవసాయ కమిషనరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టీ మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వమే ధర్నా చేయడం ఏంటని ఆయన నిలదీశారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయని ఆరోపించారు. ధాన్యం  కొనుగోలు చేయకుండా వ్యవసాయ రంగాన్ని కుదేలు, చేసి కార్పొరేట్లకు అప్పగించే కుట్ర జరుగుతోందని  అన్నారు.

 

Tags :