75 మందితో... 75 కిలోమీటర్లు

75 మందితో... 75 కిలోమీటర్లు

కాంగ్రెస్‌ పార్టీ ప్రజలందరినీ ఏకం చేసి బ్రిటిష్‌ సామ్రాజ్యంపై పోరాటం చేసి స్వాతంత్య్రం తీసుకొచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా కుసుమంచిలో పాదయాత్ర సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ పేరుతో పాదయాత్ర చేపట్టామన్నారు. పాదయాత్ర డెబ్బై ఐదు మందితో డెబ్బై ఐదు కిలోమీటర్లు కొనసాగుతుందన్నారు. యాత్రలో స్వాతంత్య్రం కోసం పోరాడిన వాళ్ళ త్యాగాలను ప్రజలకు వివరిస్తూ వాళ్ళను సన్మానిస్తూ పాదయాత్ర సాగుతుందన్నారు.

 

Tags :