తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సంబరాలు

తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సంబరాలు

తెలుగు రాష్ట్రాలో వాడవాడలా సంక్రాంతి శోభ సంతరించుకుంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేయటంతో పండగ వాతావరణం సందడిగా మారింది. పలువురు రాజకీయ ప్రముఖులు వారి ఇళ్ల వద్ద భోగి మంటలు వేసి ప్రజలకు భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటి ముంగిళ్లలో రంగవల్లులు, వీధి వీధిన భోగిమంటలతో సంక్రాంతి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తెల్లవారుజామున నుంచే ఎక్కడ చూసినా భోగిమంటలతో ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులు వేస్తూ చిన్న పెద్ద అందరూ సందడి చేస్తున్నారు. భోగి భోగభాగ్యాలు కలిగించాలని, ఏడాడంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ భోగిమంటలు వేసుకున్నారు. ఇంట నవ ధాన్యాలు, సిరి సంపదలు ఏడాది పాటు ఉండాలని కోరుకుంటూ పాత వస్తువులను తీసివేస్తూ వాటితో భోగిమంటలు వేసుకుంటూ కేరింతలు కోడుతున్నారు.

 

Tags :