నటి టబుకు 'భోలా' షూటింగ్ లో ప్రమాదం.....తీవ్ర గాయాలు

నటి టబుకు 'భోలా' షూటింగ్ లో ప్రమాదం.....తీవ్ర గాయాలు

హైదరాబాద్‌లో భోలా జరుగుతోంది ఈ మూవీ సెట్‌లో నటి టబుకు ప్రమాదం చోటు చేసుకోవడంతో తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. ఓ ట్రక్కును ఛేజ్ చేసే సీన్‌లో ప్రమాదం జరిగింది. బైక్ వచ్చి ట్రక్కును ఢీకొట్టడంతో.. ట్రక్కు లోపల టబుకు గాజు గుచ్చుకున్నట్లు సమాచారం. దీంతో ఆమె కుడి కన్నుపై గాయమైనట్లు సమాచారం. దీంతో వెంటనే ఆమెకు సెట్స్‌లో ఉన్న డాక్టర్‌తో ట్రీట్మెంట్ చేయించారు. అయితే ఆ గాయానికి ఎలాంటి కుట్లు అవసరం లేదని వైద్యులు చెప్పారు. అక్కడే సెట్స్‌లో అజయ్ దేవగణ్ వెంటనే స్పందించి.. షూటింగ్‌కు చిన్న విరామం ప్రకటించారు. టబును రెస్ట్ తీసుకోవాలని సూచించారు. పెద్ద ప్రమాదం జరగకపోవంతో మూవీ యూనిట్ ఊపిరి పీల్చుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ హీరోగా తెరకెక్కుతున్న భోలా మూవీ సెట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ సినిమాలో టబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. టబుకు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. 2023 మార్చి 30న భోలా సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ ప్రేక్షకులకు టబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కూలీ నెంబర్ వన్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ హీరోయిన్.. నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే, చెన్నకేశవరెడ్డి, అందరివాడు తదితర సినిమాలతో ఆడియన్స్‌ను మెప్పించింది. టబు నటించిన తమిళ మూవీ ప్రేమదేశం తెలుగులో డబ్ కాగా.. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టబు ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్ సినిమాలతోనే బిజీగా ఉండగా.. తెలుగులో చివరగా అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' మూవీలో కీలక పాత్ర పోషించింది.

 

 

Tags :