గుజరాత్‌ సీఎంగా భూపేంద్ర పటేట్‌ ప్రమాణ స్వీకారం

గుజరాత్‌ సీఎంగా భూపేంద్ర పటేట్‌ ప్రమాణ స్వీకారం

గుజరాత్‌ 17వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ (59) ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్‌ ఆయన చేత ప్రమాణ చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌  చౌహాన్‌, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, మన్సుఖ్‌ మాండవీయ,  ప్రహ్లాద్‌ జోషి తదితరులు హాజరయ్యారు.

మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌కు నమ్మకస్థుడైన భూపేంద్ర పటేల్‌ తొలిసారి ఎమ్మెల్యే కావడం గమనార్హం. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘట్లోడియా నియోజకవర్గం నుంచి గెలుపొందారు.  ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టడంతో పాటు మెజార్టీ ఓటర్లు ఉన్న ఆ వర్గం ఓట్లను ఒడిసిపట్టడంలో భాగంగానే రూపాణీని సీఎం పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. పటేల్‌ సామాజిక వర్గానికి చెందిన భూపేంద్రను అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు సీఎం చేయడం వెనుక బీజేపీ ఎన్నికల వ్యూహం దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

Tags :