MKOne TeluguTimes-Youtube-Channel

వివాదాస్పద ప్రాజెక్టుకు జో బైడెన్ అనుమతి

వివాదాస్పద ప్రాజెక్టుకు జో బైడెన్ అనుమతి

అలస్కాలోని అతి పెద్ద, వివాదాస్పద చమురు క్షేత్రానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం అనమతులు మంజూరు చేసింది. ఒకవైపు కాలుష్యం ఆందోళనలు వ్యకమవుతున్నా, ఎన్నికల సమయంలో ప్రభుత్వ భూముల్లో కొత్త చమురు క్షేత్రాలకు అనుమతి ఇవ్వబోమని  ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ స్థాయిలో చర్చల అనంతరం అలస్కా, ఇతర ప్రాంతాల్లోని కొన్ని చమురు బావులకు అనమతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే వివాదాస్పద ప్రాజెక్టును బైడెన్‌ అనుమతివ్వడం గమనార్హం.  హ్యూస్టన్‌కు చెందిన కొనొకా ఫిలిప్స్‌ అనే కంపెనీ మొత్తం 68 వేల ఎకరాల్లోని ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. బైడెన్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

Tags :