జో బైడెన్ తీరుపై... అమెరికన్లలో అసంతృప్తి

జో బైడెన్ తీరుపై... అమెరికన్లలో అసంతృప్తి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీరుపై అమెరికన్లలో  తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లిన రష్యా విషయంలో తమ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ తగినంత కఠినంగా వ్యవహరించడం లేదని 54 శాతం మంది అమెరికా ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా చేపట్టిన చర్యల్ని 36 శాతం మంది ఆమోదించారు. అమెరికా దళాలు నేరుగా రంగంలో దిగాలని కొంతమంది కోరుకుంటున్నారు. అసోసియేటెడ్‌ ప్రెస్‌, ఎన్‌వోఆర్‌సీ ప్రజా వ్యవహారాల పరిశోధన కేంద్రం నిర్వహించిన అభిప్రాయ సేకరణలో ఈ విషయం వెల్లడైంది.

 

Tags :