ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలవాలి : బైడెన్

ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలవాలి : బైడెన్

ఉక్రెయిన్‌ విషయంలో రష్యా నిస్సిగ్గుగా ఐక్యరాజ్యసమితి నిబంధనలను ఉల్లంఘించిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విమర్శించారు. ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌లో గత ఏడునెలలుగా రష్యా సాగిస్తున్న దురాక్రమణ గురించి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో  బైడెన్‌ కీలక ప్రసంగం చేశారు. ఉక్రెయిన్‌ దాని సంస్కృతిని చెరిపేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు. భద్రతా మండలిలోని ఓ శాశ్వత సభ్యదేశం పొరుగుదేశంపై దురాక్రమణకు పాల్పడిరది.  ప్రపంచ పటం నుంచి ఓ సార్వభౌమ దేశాన్ని చెరిపేసేందుకు ప్రయత్నించింది అని నిందించారు. భద్రతా మండలిలో రష్యాకు వీటో హక్కు, ఇతర అంతర్జాతీయ సంస్థల్లో ఒటు హక్కు కూడా తొలగించాలని పేర్కొన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.