ఆస్ట్రేలియాకు అమెరికా సబ్ మెరైన్లు

చైనాకు వ్యతిరేకంగా ఆకస్ ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా దేశాలు నెక్ట్స్ జనరేషన్ అణ్వాయుధ జలాంతర్గాముల్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళిక గురించి మూడుదేశాల నేతలు చర్చించారు. ఆకస్ అగ్రిమెంట్ కింద తొలుత ఆస్ట్రేలియాకు మూడు అణ్వాయుధ సబ్‌మెరైన్లను అమెరికా అందిస్తుంది. అత్యాధునిక టెక్నాలజీ సహాకారంతో ఈ మూడు దేశాలు న్యూక్లియర్ సబ్‌మొరైన్ ఫ్లీట్‌ను రూపొందించనున్నాయి. ఈ జలాంతర్గాములకు బ్రిటన్‌కు చెందిన రోల్స్ రాయిక్ కంపెనీ రియాక్టర్లు సమకూరుస్తుంది. ఇండోపసిఫిక్ ప్రాంతంలో చైనా అధిపత్యం పెరుగుతున్న నేపథ్యంలో దీటుగా బదులిచ్చేందుకు ఈ మూడుదేశాలు అకస్ ఒప్పందంపై సంకతాలు చేశాయి. శాన్‌డియాలోగో లో జరిగిన కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ న్యూక్లియర్ సబ్‌మెరైన్లకు చెందిన నాలెడ్జ్‌ను, స్కిల్స్‌ను ఆస్ట్రేలియన్ల తమ బేస్‌ల వద్ద నేర్చుకోవచ్చు అని తెలిపారు. 2027 నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్ ర్యాన్ బేస్ వద్ద కొన్ని న్యూక్లియర్ సబ్ మెరైన్లను ఉంచనున్నట్లు అమెరికా, బ్రిటన్ దేశాలు పేర్కొన్నాయి.