జో బైడెన్ ఇలా వ్వవహరించడం.... ఇదేమీ కొత్తకాదు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విలేకరుల సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లడం చర్చనీయాంశమైంది. పాత్రికేయుల ఒకవైపు ప్రశ్నలు సంధిస్తుంటే, ఆయన వెనక్కి తిరిగిచూడకుండా గది నుంచి బయటకు వెళ్లిపోవడం విమర్శలకు దారితీసింది. అమెరికా బ్యాంకుల సంక్షోభం గురించి మీడియా ప్రశ్నిస్తుండగా, జవాబివ్వకుండా బైడెన్ అక్కడి నుంచి నిష్క్రమించారు. మరికొన్ని బ్యాంకులు సంక్షోభంలోకి వెళ్లితే పరిస్థితి ఏమిటని మరో ప్రశ్న వినిపిస్తుండగానే, తనకేమీ పట్టనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమావేశం జరుగుతున్న గది తలుపు వేసి బయటకు వెళ్లిన దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. విలేకరుల సమావేశం నుంచి ఆయన మధ్యలోనే వెళ్లిపోవం ఇదేమీ కొత్తకాదు. ఇటీవల చైనా నిఘా బెలూన్లన ఘటనపై జరిగిన మీడియా సమావేశంలోనూ ఆయన ఇలాగే వ్యవహరించారు. చైనాలో ఉన్న మీ కుటుంబ వ్యాపారాల వల్ల దేశ భద్రత విషయంలో రాజీపడ్డారా అనే ప్రశ్న ఎదురవడంతో బైడెన్ ఇలాగే జారుకున్నారు. కొంచెం బ్రేక్ ఇవ్వండి అంటూ వెళ్లిపోయారు.