జెలెన్‌స్కీపై జో బైడెన్ అసహనం....

జెలెన్‌స్కీపై జో బైడెన్ అసహనం....

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అసహనం వ్యక్తం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్‌ 15వ తేదీన బిలియన్‌ డాలర్ల మావనీయ, సైనిక సాయం ఇచ్చే విషయాన్ని చెప్పేందుకు జెలెన్‌స్కీకి  బైడెన్‌ ఫోన్‌ చేశారు.  ఈ క్రమంలో బైడెన్‌ వివరాలు చెప్పటం ముగించాక, ఉక్రెయిన్‌కు ఇంకా కావాల్సిన పరికరాల జాబితాను జెలెన్‌స్కీ చెప్పటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో అసహనానికి గురైన బైడెన్‌ స్వరం పెంచి కొంచెం కృతజ్ఞత చూపించండి అని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌కు సాయం మంజూరు అయినప్పుడల్లా సాధారణంగా బైడెన్‌ స్వయంగా ఫోన్‌ చేసి ఆ వివరాలను జెలెన్‌స్కీకి వివరించారు.

2022లో అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు ఉక్రెయిన్‌కు కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ రిపోర్టు వెల్లడిస్తోంది. అమెరికా ఇచ్చిన ఆయుధాల్లో హైమార్స్‌ రాకెట్‌ సిస్టమ్‌, స్టింగర్‌, జావెలిన్‌ క్షిపణులు, ఎం-17 హెలికాప్టర్లు ఉన్నట్లు పెంటగాన్‌ నివేదికలు చెబుతున్నాయి.  జనవరి నుంచి ఆగస్టు వరకు అమెరికా నుంచి 8.79 బిలియ్‌ డాలర్ల సాయం అందింది. అంతేకాదు ఉక్రెయిన్‌ సైన్యానికి అవసరమైన శిక్షణ, ఇంటెజెన్స్‌ వంటివి కూడా అమెరికా నుంచి అందుతున్నాయి.

 

Tags :
ii). Please add in the header part of the home page.