అమెరికాలో కీలక పదవికి భారత సంతతి మహిళ నామినేట్

అమెరికాలో కీలక పదవికి  భారత సంతతి మహిళ నామినేట్

భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌ మహిళ రాధా అయ్యంగార్‌ పెంటగాన్‌లో ఉన్నత స్థానంలో నియమితులయ్యారు. ప్రస్తుతం అమెరికా రక్షణ శాఖ ఉప మంత్రి వద్ద చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా పని చేస్తున్న రాధా అయ్యంగార్‌ ప్లంబ్‌ను ఇప్పుడే అదే రక్షణ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రికి డిప్యూటీగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నియమించారు. ఎననామిక్స్‌లో ఎంఎస్‌, పిహెచ్‌డి పూర్తి చేసిన ఆమె లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్‌సలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అంతకుముందు గూగుల్‌లో ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ కోసం రీసెర్చ్‌ అండ్‌ ఇన్‌సైట్స్‌ డైరెక్టర్గఆ విధులు నిర్వహించారు. ఆమె గతంలో ఫేస్‌బుక్‌లో పాలసీ అనాలసిస్‌ గ్లోబల్‌ హెడ్‌గానూ, రాండ్‌ కార్పొరేషన్‌తో సీనియర్‌ ఎకనామిస్ట్‌గానూ పని చేశారు.

 

Tags :