దేశ చరిత్రలో అతిపెద్ద విపత్తు : జో బైడెన్

దేశ చరిత్రలో అతిపెద్ద విపత్తు : జో బైడెన్

అమెరికా దేశ చరిత్రలో అతిపెద్ద విపత్తుల్లో టోర్నడో కూడా ఒకటని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. కెంటకీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. టోర్నడో ప్రభావిత ప్రాంతాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఆయా ప్రాంతాల్లో తాను స్వయంగా పర్యటిస్తానని బైడెన్‌ వెల్లడిరచారు. గత రెండు రోజులుగా ఆరు రాష్ట్రాల్లో టోర్నడోలు విరుచుకుపడుతున్నాయి. 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గల్లంతైనట్టు సమాచారం. విస్సౌరి, మిసిసిపి, ఆర్కాన్నాస్‌, టెన్నెసీలోని వివిధ ప్రాంతాల్లోనూ టోర్నడోలు బీభత్సం సృష్టించి ఆస్తి, ప్రాణ నష్టాలను కలిగించాయి. ప్రాణ నష్టంపై ఇప్పటి వరకు నిర్ధారణకు రాలేదు. అమెరికాలో చరిత్రలో 1925 తర్వాత అత్యంత తీవ్రమైన టోర్నడో ఇదేనని అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో మిస్సౌరీలో సుడిగాలుల ధాటికి 915 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

 

Tags :