అమెరికా సంచలన నిర్ణయం

అమెరికా సంచలన నిర్ణయం

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనా రాజధాని బీజింగ్‌లో జరగనున్న వింటర్‌ ఒలింపిక్స్‌పై అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ గేమ్స్‌ దౌత్య బహిష్కరణపై యోచిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. అమెరికా అథ్లెట్లపై ఎటువంటి ప్రభావమూ పడకుడా చైనాలోని ఉయ్‌ఘుర్‌ ముస్లిం హక్కుల ఉల్లంఘనపై మరింత కఠినంగా వ్యవహరించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్వేత సౌధంలో కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడోతో సమావేశం సందర్భంగా బైడెన్‌ మీడియాతో మాట్లాడుతూ మేము పరిశీలిస్తున్నాం అంటూ వింటర్‌ ఒలింపిక్స్‌ దౌత్య బహిష్కరణ గురించి వెల్లడిరచారు. గత వారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, బైడెన్‌ మధ్య  జరిగిన వీడియో సదస్సులో స్థిరత్వాన్ని విభేదాలను  నిరోధించాలని నిర్ణయించారు. అంతలోనే బైడెన్‌ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

Tags :