ఉక్రెయిన్ కోసం.. కాంగ్రెస్ అనుమతి కోరిన జో బైడెన్

రష్యా దురాక్రమణ యత్నాన్ని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు మరో 3,300 కోట్ల డాలర్ల సాయం అందించడానికి అనుమతించాలని అమెరికన్ కాంగ్రెస్‌ను దేశాధ్యక్షుడు జో బైడెన్ కోరారు. ఉక్రెయిన్‌కు మరింత కాలం సాయమందించే ఉద్దేశం అమెరికాకు ఉందన్న సంకేతాన్ని ఆయన వెలువరించారు. సైనిక అవసరాలను తీర్చుకోవడంతో పాటు ఆర్థిక, మానవతా సాయానికి ఈ మొత్తం ఉపకరిస్తుందని తెలిపారు. గత నెలలో 1,360 కోట్ల డాలర్ల సాయానికి ఆమోదం లభించగా ఆ మొత్తమంతా దాదాపు ఖర్చయిపోయింది. రష్యా కుబేరుల ఆస్తుల్ని జప్తు చేయడానికి, వాటి అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఉక్రెయిన్‌కు సాయంగా వాడేందుకు అనుమతించాలని కాంగ్రెస్‌కు బైడెన్ తాజాగా కోరారు.
Tags :