ఓటమిని జీర్ణించుకోలేకే .. ఈ తిరుగుబాటు : జో బైడెన్

ఓటమిని జీర్ణించుకోలేకే .. ఈ తిరుగుబాటు : జో బైడెన్

డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పిన పెద్ద బూటకపు మాటలే ఏడాది కిందట అమెరికా పార్లమెంటు భవన సముదాయం కేపిటల్‌ హిల్‌పై దాడికి కారణమయ్యాయని అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా మండిపడ్డారు. మాజీ అధ్యక్షుడి మాటలు ఇప్పటికీ జాతీయ విభజన దిశగా కొందర్ని ప్రేరేపిస్తున్నాయన్నారు. అగ్రరాజ్య ప్రజాస్వామ్య గొంతుపై బాకు పెట్టడానికి ఎవర్నీ అనుమతించబోనన్నారు. దాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బైడెన్‌ హాజరయ్యారు. రిపబ్లికన్లు ఓటమిని జీర్ణించుకోలేకే నాడు తన విజయాన్ని అంగీకరించలేకపోయారని దెప్పిపొడిచారు. తిరుగుబాటు ఘటనకు సంబంధించి తప్పుడు కథనాలు పుట్టుకు రావడానికి తూర్పారబట్టారు. గతేడాది జనవరి 6న ఇక్కడేం జరిగిందో మనమంతా కళ్లారా చూశాం. నిజమేదో, అబద్ధమేదో మనకు స్పష్టంగా తెలుసు. నాటి ఎన్నికల గురించి మాజీ అధ్యక్షుడు అబద్ధాలను వ్యాపింపచేశారు. నేను ఈ దేశాన్ని పరిరక్షిస్తాను అని  తెలిపారు.

 

Tags :