తమ బలమేంటో ప్రపంచం మొత్తానికి తెలుసు: బైడెన్

తమ బలమేంటో ప్రపంచం మొత్తానికి తెలుసు: బైడెన్

తైవాన్‌పై డ్రాగన్‌ దేశం చైనా దాడి చేస్తే, అప్పుడు తైవాన్‌కు అండగా పోరాడుతామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. తమ బలమేంటో చైనా, రష్యా సహా ప్రపంచం మొత్తానికి తెలుసని అన్నారు. తమ బలం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రపంచంలోనే తాము అత్యంత శక్తివంతమైన మిలిటరీ దేశమని ఆయన పేర్కొన్నారు. చైనా, తైవాన్‌ ఉద్రిక్తల నేపథ్యంలో తాజాగా ఓ ప్రకటనలో బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.  తైవాన్‌ విషయంలో చైనా కొన్నాళ్లుగా అతివాద ధోరణి ప్రదర్శిస్తోంది. తైవాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం తైవాన్‌ గగనతలంలోకి 51 యుద్ధ విమానాలను చైనా పంపింది. కొద్ది రోజులుగా చైనా ఇదే తరహాలో కవ్వింపు చర్యలకు దిగుతోంది. తైవాన్‌తో అమెరికాకు ఉన్న ఒప్పందాల్లో ఎలాంటి మార్పు లేదని, ఆ పాలసీలనే ఇకపై కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తైవాన్‌ను చైనా నుంచి కాపాడతామని చైనాకు పరోక్షంగా హెచ్చరిక చేశారు.

 

Tags :