ఆక్రమిస్తే ఆంక్షలు తప్పవు : రష్యాకు అమెరికా హెచ్చరిక

ఆక్రమిస్తే ఆంక్షలు తప్పవు : రష్యాకు అమెరికా హెచ్చరిక

ఉక్రెయిన్‌ తూర్పు సరిహద్దు వెంట లక్షా 75 వేల మంది సైనికులను, యుద్ధ ట్యాంకులను మోహరించిన రష్యాను అమెరికా హెచ్చరించింది. ఉక్రెయిన్‌ సారభౌమత్వం, సమగ్రతలను దెబ్బతీసే రష్యా దూకుడుకు అంతర్జాతీయ ఆంక్షలతో ధీటైన సమాధానం చెప్పామని పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో వర్చువల్‌ భేటీ ఇందుకు వేదికైంది. దాదాపు రెండు గంటల పాటు ఇరు అగ్ర రాజ్యాధినేతలు మాట్లాడుకున్నారు. వాషింగ్టన్‌లో వైట్‌హౌస్‌ నుంచి బైడెన్‌, నల్ల సుమద్ర తీర పట్టణం సోచీలోని అధికార నివాసం నుంచి పుతిన్‌ వీడియో కాల్‌ మాట్లాడుకున్నారు. ఆత్మీయ పలకరింపులతో మొదలైన ఈ వీడియో కాల్‌ చివర్లో వాడివేడి చర్చలతో ముగిసిందని తెలిసింది.

నాటో కూటమిలోకి ఉక్రెయిన్‌ను చేర్చుకోవాలనే యోచనను మానుకోవాలని, ఈ మేరకు అమెరికా చట్టబద్ధ హామీ ఇవ్వాలని బైడెన్‌తో పుతిన్‌ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకోనుందనే అమెరికా నిఘా నివేదికల నేపథ్యంలో ఇరునేతల భేటీ అంశం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అణ్వా యుధాల నియంత్రణ, సైబర్‌ సెక్యూరిటీ, ఇరాన్‌ అణు కార్యక్రమాలు సైతం వీరి చర్చల్లో భాగం కావచ్చని అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు.

 

Tags :