అణ్వాయుధ ప్రయోగం తీవ్ర తప్పిదమే : జో బైడెన్

అణ్వాయుధ ప్రయోగం తీవ్ర తప్పిదమే : జో బైడెన్

ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగిస్తే అది తీవ్ర తప్పిదమే అవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు. ఐరోపాలోని అతిపెద్ద అణు విద్యుత్‌ కర్మాగారంలో రష్యా బలగాలు రహస్యంగా పని చేస్తున్నాయని, ఈ కసరత్తు అంతా డర్టీబాంబు ప్రయోగానికేనని ఉక్రెయిన్‌ ఆరోపిస్తున్న నేపథ్యంలో బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరైన్‌ జీన్‌ పెర్రీ అన్నారు. ఏదేమైనా అణ్వాయుధాల ప్రయోగానికి రష్యా సిద్ధమవుతుందని అనుకోవడం లేదన్నారు. అయినప్పటికీ పరిస్థితులను అత్యంత క్షణ్ణంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య శాంతి చర్చలపై తుది నిర్ణయం ఆయా దేశాల అధినేతలదేనని తెలిపారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.