ప్రపంచాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలి : క్లింటన్

ప్రపంచాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలి : క్లింటన్

ప్రపంచం అగ్నికీలల్లో చిక్కుకుపోయిందనీ, దాన్ని సంక్షోభం నుంచి బయట పడేయడానికి ప్రభుత్వాలు, వ్యాపార, వితరణ సంస్థలు, ప్రముఖ కంపెనీలు కలిసికట్టుగా కృషి చేయాలని అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ పిలుపునిచ్చారు. 2016 తర్వాత మొదటిసారి క్లింటన్‌ గ్లోబల్‌ ఇనీషియేటివ్‌ (సీజేఐ) ఆధ్వార్యాన న్యూయార్క్‌లో ఈ నెల 19, 20 తేదీల్లో అంతర్జాతీయ ప్రముఖులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిన వెయ్యి మంది ప్రముఖులకు చోటు లేక ప్రవేశం నిరాకరించాల్సి వచ్చింది. ఈ సదస్సులో బిల్‌, ఆయన భార్య హిల్లరీ, కుమార్తె చెల్సియాలు మానవాళి శ్రేయస్సుకు కలిసికట్టుగా పాటుపడదామని పిలుపు ఇవ్వనున్నారు.

 

Tags :