ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడిన బిట్ గేట్స్ కుమార్తె

ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడిన బిట్ గేట్స్ కుమార్తె

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌ మిలిందా గేట్స్‌ల కుమార్తె జెన్ఫీఫర్‌ కేథరిన్‌ తన స్నేహితుడు, ప్రియుడు, హార్స్‌ రైడర్‌ అయిన నాయెల్‌ నాజర్‌ను వివాహం చేసుకుంది. జెన్నిఫర్‌ పెళ్లి జరిగినట్లు అమెరికాకు చెందిన పీపుల్‌ మ్యాగజైన్‌ ధృవీకరించింది. వీరి వివాహం న్యూయార్క్‌లో జరిగినట్లు ప్రకటించింది. కొన్ని  నెలల క్రితం మిలిందా గేట్స్‌తో విడాకాలు తీసుకున్న బిల్‌గేట్స్‌ కుమార్తె జెన్నీఫర్‌ వివాహ వేడుకకు ఒకరోజు ముందుగా హాజరయ్యారు. కాగా కుమార్తె వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను తల్లి మిలిందా దగ్గరుండి చూసుకున్నారు. అతికొద్ది మంది బంధువుల సమక్షంలోనే జెన్నీఫర్‌, నాజర్‌ల  పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది జరిగిన టోక్యో  ఒలింపిక్స్‌లో అమెరికా తరపున నాజర్‌ గుర్రపు స్వారీలో పాల్గొన్నాడు. ఈజిప్టు సంతతికి చెందిన నాయల్‌ నాజర్‌ది సంపన్న కుటుంబం. వీరిద్దరూ స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో కలిసి చదువుకుంటున్న సమయంలో ప్రేమలో పడ్డారు. చివరకు సోషల్‌ మీడియా వేదికగా జెన్నీఫర్‌ తన ప్రేమ వివాహాన్ని వెల్లడించింది.

 

Tags :