కోవిడ్ బారిన పడిన బిల్‌గేట్స్‌ ...

కోవిడ్ బారిన పడిన బిల్‌గేట్స్‌ ...

మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్‌గేట్స్‌ కోవిడ్‌ బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో వెంటనే టెస్ట్‌ చేయించుకున్నట్టు అందులో కోవిడ్‌ 19 పాజిటివ్‌గా తేలినట్టు ఆయన వెల్లడిరచారు. వైద్యులు అందించిన సూచనలు పాటిస్తూ ఐసోలేషన్‌లోకి వెళ్తున్నట్లు తెలిపారు. తిరిగి ఆరోగ్యవంతుడైన తర్వాత ఐసోలేషన్‌ వీడుతానని బిల్‌గేట్స్‌ తెలిపారు. అయితే ఇప్పటికే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, బూస్టర్‌ డోసు వేసుకున్నందున పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు. కోవిడ్‌ ప్రపంచాన్ని ముంచెత్తడానికి ముందే  ఓ మహమ్మారి మానవాళిపై దాడి చేసే అవకాశం ఉందని బిల్‌గేట్స్‌ ముందుగానే ప్రపంచ దేశాలకు సూచనలు చేశారు.

 

Tags :