కేసీఆర్ కెప్టెన్ అయితే.. ఒవైసీ వైస్ కెప్టెన్

కేసీఆర్ కెప్టెన్ అయితే.. ఒవైసీ వైస్ కెప్టెన్

ముఖ్యమంత్రి కేసీఆర్‍ కెప్టెన్‍ అయితే ఒవైసీ వైఎస్‍ కెప్టెన్‍ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‍ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భాష విషయంలో నా గురువు కేసీఆరే అన్నారు. టీఆర్‍ఎస్‍, బీజేపీ ఎప్పటీకీ ఒక్కటి కాదన్నారు. బీజేపీతో తప్ప టీఆర్‍ఎస్‍ అన్ని పార్టీలతో కలిసి పోటీ చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‍కి ఓటేస్తే టీఆర్‍ఎస్‍ వేసినట్లే అని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు బీజేపీ లోకి వెళ్తున్నారు అని ఇంటలిజెన్స్ సమాచారము తోనే కేసీఆర్‍ ఢిల్లీ వెళ్లారని తెలిపారు. ఎమ్మెల్యేలు మంత్రులను కాపాడుకోవడానికి కేసీఆర్‍ ఢిల్లీ వెళ్లారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో కొందరు గ్లామర్‍ కాపాడుకోవడానికి డ్రగ్స్ వాడుతున్నారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే వారికి రక్త పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

 

Tags :