మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు ... ఆయన హత్యకు కుట్ర

మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు ... ఆయన హత్యకు కుట్ర

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీపై డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆయన బెదిరిస్తున్నారని, తివారి హెచ్చరికలు చూస్తుంటే కేజ్రీవాల్‌ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.  ఆయనను ఏమీ చేయ్యలేక హత్య చేయాలనుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్‌పై ఎవరైనా దాడి చేయవచ్చని తివారీ అన్న మాటలకు అర్థమేంటని  ప్రశ్నించారు.  ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, పోలీసు కేసు కూడా పెడతామని పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలు, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.

 

Tags :