అవన్నీ మునుగోడు ఉప ఎన్నిక కోసమే?

అవన్నీ మునుగోడు ఉప ఎన్నిక కోసమే?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మనుగోడు ఉప ఎన్నిక కోసం కేసీఆర్‌ వరాలు కురిపిస్తున్నారని విమర్శించారు. ఇటీవల హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఎనిమిదేళ్ళుగా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికల కోసమే గిరిజన రిజర్వేషన్లను తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. గిరిజనులను కేసీఆర్‌ దగా చేస్తున్నారని, నమ్మితే మోసపోతారని విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా ప్రధాని మోదీని ఎదుర్కోలేక  రాహుల్‌ గాంధీ కుటుంబం, కేసీఆర్‌ కుటుంబం ఆయనపై విషయం కక్కుతున్నాయని మండిపడ్డారు.

 

Tags :