చరిత్రలో నిలిచే విధంగా విజయ్ సంకల్ప్

చరిత్రలో నిలిచే విధంగా విజయ్ సంకల్ప్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయ్‌ సంకల్ప్‌ సభ చరిత్రలో నిలిచిపోతుందని బీజేపీ రాష్ట్ర సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  ఫ్లెక్సీ రాకీయాలు చేసే స్థాయికి కేసీఆర్‌ దిగజారిపోయారని విమర్శించారు. కుటుంబ, అవినీతి పాలనను అంతమొందించడానికి మోదీ వస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలు కార్యవర్గ సమావేశాల్లో కన్పిస్తాయని అన్నారు. హోర్డింగ్‌ల ఏర్పాటు విషయంలో కేసీఆర్‌ది చౌకబారుతనమని వ్యాఖ్యానించారు. అధికారం, డబ్బును అడ్డుపెట్టుకుని కేసీఆర్‌ పాలన చేయడం సరికాదన్నారు. రేవంత్‌, మంద కృష్ణ మాదిగలు ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరిస్తే బాగుంటుందని హితవు పలికారు.  అగ్నిపథ్‌ పథకం యువకులకు అర్థం అయితే చాలు అని తెలిపారు.

 

Tags :