సీఎం జగన్ ఆ సంప్రదాయం ఎందుకు పాటించరు ?

సీఎం జగన్ ఆ సంప్రదాయం ఎందుకు పాటించరు ?

తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన సతీమణి భారతి తీసుకెళ్లకపోతే ఆయనకు హిందూ సంప్రదాయాలపై విశ్వాసం లేనట్లుగా భావించాల్సి వస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూమతంపై విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి డిక్లరేషన్‌పై సంతకం చేయాలన్నారు. విశాఖ శారదా పీఠం, హైదరాబాద్‌ జీయర్‌ పీఠం వద్దకు వెళ్లే జగన్‌ తిరుమల స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సతీమణిని తీసుకువెళ్లకపోతే, ఆయన పీఠాల పర్యటనను హిందూ సమాజం నమ్మదని, అన్యమతస్తుడిగానే గుర్తిస్తుందన్నారు. ఇప్పటి వరకు అందరు ముఖ్యమంత్రులు తమ భార్యలతోనే బ్రహ్మోత్సవాలకు వెళ్లారని, మరి సీఎం జగన్‌ ఎందుకు ఆ సంప్రదాయం పాటించరని ప్రశ్నించారు.  హిందూ సంప్రదాయాలపై నమక్మం ఉందని సీఎం జగన్‌ డిక్లకేషన్‌పై సంతకం పెట్టాలన్నారు. టీటీడీ అధికారులు కూడా సంప్రదాయం పాటించాలన్నారు. సోనియాగాంధీ, అబ్దుల్‌ కలామ్‌తో పాటు చాలా మంది అన్యమతస్తులు డిక్లకేషన్‌పై సంతకం పెట్టారని, మరి జగన్‌ ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. అంటే హిందూ సంప్రదాయాలపై నమ్మకం లేదా అన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.