ఈ రెండింటిలో కేజ్రీవాల్, కేసీఆర్ పాత్ర : బీజేపీ నేత తరుణ్ చుగ్

ఈ రెండింటిలో కేజ్రీవాల్, కేసీఆర్ పాత్ర  : బీజేపీ నేత తరుణ్ చుగ్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మధ్యం  కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఉన్నారని భారతీయ జనతా పార్టీ  తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్‌ చుగ్‌ ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ  ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సీఆర్పీసీ సెక్షన్‌ 160 ప్రకారం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చిందన్నారు.  చట్టానికి అందరూ సమానమేనని, ఈ విషయంలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు గ్రహించాలని అన్నారు.  సీఎం కేసీఆర్‌కు అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగమన్నా, భారత చట్టాలన్నా గౌరవం లేదని అన్నారు. ఉన్నత కుటుంబంలో జన్మించినంత మాత్రాన ఎవరూ చట్టానికి అతీతులు కారని అన్నారు. కేసీఆర్‌ అంటేనే కుటుంబవాదం, అవినీతి, దోపిడీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చాలదన్నట్టు తమ అవినీతిని ఢిల్లీ వరకు విస్తరించారని విమర్శించారు. ఢిల్లీ మధ్యం పాలసీ, పంజాబ్‌ మద్యం పాలసీల్లో అనేక  అక్రమాలు చోటుచేసుకున్నాయని,  ఈ రెండిరటిలో కేజ్రీవాల్‌, కేసీఆర్‌ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. అందుకే కేసీఆర్‌, కవిత పదే పదే ఢిల్లీ వచ్చి వెళ్తున్నారని అన్నారు.

 

 

Tags :