2019లో జరిగిన పొరపాటు... 2024లో మళ్లీ జరిగితే

2019లో జరిగిన పొరపాటు... 2024లో మళ్లీ జరిగితే

ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగిన పొరపాటు మళ్లీ 2024లోనూ జరిగితే మనల్ని ఆ భగవంతుడు కూడా రక్షించలేరని బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు. రాజధాని అమరావతికి మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు మనం మన అమరావతి పేరిట ఆ పార్టీ నేతలు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా రాజధాని పరిధిలోని తుళ్లూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సుజనా చౌదిరి మాట్లాడుతూ 2019లో జరిగిన పొరపాటు మళ్లీ జరగకుండా చూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఆలోచించి  నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో దుర్షాషలు మంచిది కాదని రాజధాని ప్రజలకు సూచించారు. రాజధాని ప్రాంతానికి  ఏ పార్టీ నేతలు వచ్చిన అమర్యాదగా ప్రవర్తించొద్దన్నారు.

 

Tags :