ఫిబ్రవరి రెండోవారంలో .. గౌరవెల్లి నుంచి ప్రగతి భవన్ వరకు

ఫిబ్రవరి రెండోవారంలో .. గౌరవెల్లి నుంచి ప్రగతి భవన్ వరకు

ఫిబ్రవరి రెండోవారంలో గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి ప్రగతి భవన్‌ వరకు పాదయాత్ర చేయనున్నట్లు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు తెలిపారు. గౌరవెల్లిలో భూనిర్వాసితులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌కు నిర్వాసితుల సమస్యలు విన్నవిస్తామని తెలిపారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల సమస్యలపై సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీలో నిలదీస్తామని ఆయన ప్రకటించారు. కమీషన్ల కోసమే కేసీఆర్‌ ప్రాజెక్టుల రీడిజైన్‌ చేశారని ఆయన ఆరోపించారు. నిర్వాసితులపై పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేయడం అమానుషమని అన్నారు. ఓట్ల కోసమే దళితబంధు పథకాన్ని తీసుకువచ్చి హుజురాబాద్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు.

 

Tags :