హుసేన్‌ సాగర్‌లో వద్దంటే.. ప్రగతిభవన్‌ ముందు

హుసేన్‌ సాగర్‌లో వద్దంటే.. ప్రగతిభవన్‌ ముందు

హుసేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయవద్దంటూ మంటప నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హుసేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయోద్దని పోలీసులు అడ్డుకుంటే విగ్రహాలను ప్రగతి భవన్‌ ముందు ఉంచుతామని హెచ్చరించారు. విగ్రహాల తయారీ, మండపాలకు తరలింపు తదితర సమయాలలో మౌనంగా ఉన్న పోలీసులు విగ్రహాలను మండపంలో ప్రతిష్టించి పూజలు చేస్తున్న సమయంలో భయబ్రాంతులకు గురిచేయడం ఏమిటని మండిపడ్డారు. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలు, పరిస్థితులకు పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

 

Tags :