అది బయటపడుతుందనే భయంతోనే... రాష్ట్రంలోకి సీబీఐని

అది బయటపడుతుందనే భయంతోనే... రాష్ట్రంలోకి  సీబీఐని

తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అది భయటపడుతుందనే భయంతోనే సీబీఐని రాష్ట్రంలోకి రావొద్దంటున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా, ప్రజా విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి హామీలను విస్మరించారన్నారు. ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయని మండిపడ్డారు.పేదవాడు వంద గజాల భూమి కొనకుండా విపరీతంగా ధరలు పెంచారని ధ్వజమెత్తారు.  కేంద్ర ప్రభుత్వం నిధులన్నింటినీ టీఆర్‌ఎస్‌ పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్‌లన్నీ స్కామలుగా మారాయన్నారు. తెలంగాణ మళిదశ ఉద్యమానికి ఆద్యుడైన శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మ షోషిస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలపై ఐటీ, ఈడీ దాడులకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. సీఎం కుమార్తె అయినా ఎవరైనా చట్టాలకు అతీతం కాదన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ప్రేమయం లేదన్నప్పుడు  నిరూపించుకోవాలని సూచించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటాయన్నారు.  కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌కు బీ టీమ్‌గా మారిందని విమర్శించారు. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందని తెలిపారు.

 

 

Tags :