MKOne TeluguTimes-Youtube-Channel

ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు అభ్యంతరమేంటి? : బండి సంజయ్

ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు అభ్యంతరమేంటి? : బండి సంజయ్

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల బతుకులు సర్వనాశనం అయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన మహిళ కమిషన్‌ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన కమిషన్‌ ఎదుట విచారణ హాజరయ్యారు. అనంతరం సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. తన వ్యాఖ్యలు తెలంగాణల మాట్లాడే సాధారణ బాషేనని తెలిపారు. టీఎస్‌పీఎస్‌సీ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు. 

 

 

Tags :