బెంగాల్ సీఎం మమతబెనర్జికి ఎదురుదెబ్బ

బెంగాల్ సీఎం మమతబెనర్జికి ఎదురుదెబ్బ

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతబెనర్జికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నందిగ్రామ్‌లోని ఓ సహకార సంఘానికి జరిగిన ఎన్నికల్లో మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సహకార సంఘంలోని మొత్తం 12 స్థానాలకుగాను టీఎంసీ కేవలం ఒక్క స్థానానిన మాత్రమే దక్కించుకుంది. మిగతా 11 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.

 

Tags :