ఆ దేశానికి అదనంగా సైనిక సాయం : అమెరికా

ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందించనున్నట్లు అమెరికా ప్రకటించింది.. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఉక్రెయిన్ నేతలతో కీవ్‌లో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ను నిలిపేందుకు ఆ దేశానికి అదనంగా సైనిక సాయం, దౌత్యపరమైన మద్దతు వుంటుందని అమెరికా మంత్రులు ఉక్రెయిన్ నేతలకు హామీ ఇచ్చారు. బ్లింకెన్, ఆస్టిన్ రాకముందే అమెరికా నుంచి తమకు మరిన్ని ఆయుధాలు కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. భద్రతా కారణాల రీత్యా మంత్రులిద్దరు ఉక్రెయిన్ వీడి వెళ్లేవరకు మీడియాని రానివ్వలేదు. వీరి పర్యటన గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించినా అమెరికా మాత్రం ఉక్రెయిన్‌లో పర్యటన ముగిసిన తరువాతే ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
Tags :