భారత శాస్త్రవేత్తల ఘనత.. ఆరంభంలోనే గుర్తించే

భారత శాస్త్రవేత్తల ఘనత.. ఆరంభంలోనే గుర్తించే

రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభదశలో గుర్తించేందుకు భారత శాస్త్రవేత్తలు ఒక రక్త పరీక్షను అభివృద్ధి చేశారు. దీని ద్వారా ఈ రుగ్మతను 99 శాతం కచ్చితత్వంతో గుర్తించొచ్చని వారు తెలిపారు. దీనికి అమెరికాకు చెందిన ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) నుంచి బ్రేక్‌థ్రూ డిజిగ్నేషన్‌ లభించింది. ఇది తీవ్రస్థాయి రుగ్మతలకు చికిత్స కోసం ఉద్దేశించిన ఔషధాలను వేగంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ప్రక్రియ. రక్త ప్రసరణ వ్యవస్థలో ఉన్న కణతి కణాలను గుర్తించడానికి ఈ పరీక్షను రూపొందించారు. డాటార్‌ క్యాన్సర్‌ జెనిటిక్స్‌ అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది సున్నా, ఒకటి దశల్లో ఉన్న రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించగలదని పరిశోధకులు తెలిపారు. రేడియోధార్మికత గానీ సంప్రదాయ మామోగ్రఫీతో ముడిపడిన ఎలాంటి అసౌకర్యం ఉండబోదని శాస్త్రవేత్తలు తెలిపారు.  ఇప్పటికే ఐరోపా మార్కెట్లో ఇది అందుబాటులో ఉందని, ఈజీ చెక్‌ పేరుతో త్వరలోనే భారత్‌లో లభ్యమవుతుందని తెలిపారు.

 

Tags :