అమరావతి ఉద్యమానికి సోనూసూద్ మద్దతు

అమరావతి ఉద్యమానికి సోనూసూద్ మద్దతు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులకు సినీనటుడు సోనూసూద్‍ మద్దతు ప్రకటించారు. విజయవాడ పర్యటనకు వచ్చిన సోనూసూద్‍ను గన్నవరం విమానాశ్రయంలో మహిళా రైతులు కలిశారు. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరగా రైతుల వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. రాజధాని గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, పెదపరిమి దీక్షా శిబిరాల్లో నిరసన తెలిపారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

అనంతరం సోనూసూద్‍ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో సోనూసూద్‍కు స్వాగతం పలికారు. దేవస్థానం దర్శనం అనంతరం పండితతులు వేదాశీర్వచనం పలికారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

 

Tags :