చార్మినార్‌కు బాంబు బెదిరింపు

చార్మినార్‌కు బాంబు బెదిరింపు

చార్మినార్‌కు బాంబు బెదిరింపు నగరంలో కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు చార్మినార్‌ వద్ద బాంబులు పెట్టారని వార్త వైరల్‌గా మారింది. చార్మినార్‌ ప్రాంతంలో పోలీసులు  తనిఖీలు నిర్వహించారు. బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. చార్మినార్‌ పరిసరాలతో పాటు పలు హోటళ్లు, దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. దీంతో స్థానికులు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురుయ్యారు. సాధారణ  తనిఖీలేనని పాతబస్తి పోలీసులు తెలిపారు. ఎలాంటి బాంబు బెదిరింపులు రాలేదని చెప్పడం అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే విషయమై చార్మినార్‌  ఎస్‌ఐ స్పందించారు. పోలీసులకు ఎలాంటి ఫోన్‌ కాల్‌ రాలేదని తెలిపారు. బాంబు బెదిరింపులు వచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టివేశారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.