ఆసక్తికరంగా 'బొమ్మల కొలువు'

హృషికేశ్, ప్రియాంక శర్మ, మాళవికా సతీశన్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం 'బొమ్మల కొలువు'. సుబ్బు వేదుల దర్శకుడు. ఎ.వి.ఆర్.స్వామి నిర్మాత. ఈ సినిమా ట్రైలర్ను కోన వెంకట్, బి.వి.ఎస్.రవి విడుదల చేశారు. అనంతరం చిత్ర దర్శకుడు మాట్లాడుతూ రాహు తర్వాత నా దర్శకత్వం నుంచి వస్తున్న రెండో చిత్రమిది. ఓ ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కించాం. త్వరలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు. దర్శకుడు సుబ్బు ఎంతో విభిన్నంగా తెరకెక్కించారు. నేనిందులో రుద్ర అనే పాత్రలో కనిపిస్తా. నాపై నమ్మకంతో అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ అన్నారు హీరో హృషికేశ్. నిర్మాత మాట్లాడుతూ ఇదొక వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందింది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మా బ్యానర్లో దీనితో పాటు మరో రెండు సినిమాలు నిర్మించాం. ఆ మూడు ఈ నెలలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఛాయాగ్రహణం: ఈశ్వర్.