అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఆషాఢ బోనాలు

అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఆషాఢ బోనాలు

తెలంగాణలో గోల్కోండ కోట బోనమెత్తింది. ఆషాడమాసం బోనాలు చారిత్రక కోట నుంచి ప్రారంభమయ్యాయి. భాగ్యనగరంలో నెల రోజుల పాటు జరగనున్న బోనాల జాతరను అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. గోల్కొండ బోనాల తర్వాత లష్కర్‌, లాల్‌దర్వాజ, ధూల్‌పేట, బల్కంపేట, పాతబస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాలు నిర్వహించనున్నారు. గోల్కొండ బోనాల ప్రారంభోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాష్‌ యాదవ్‌, మహమూద్‌అలీ, జీహెచ్‌హెంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ బోనాలు అత్యంత సంతోషకరమైన సమయమని అన్నారు. వందల ఏళ్లుగా బోనాల జాతర జరుగుతోందన్నారు. బోనాలు మన సంస్కృతికి ప్రతీక లాంటిదని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక నగరంలోని ప్రతి ఆలయానికి ఆర్థిక సాయం అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా 8 ఏళ్లుగా రాష్ట్రంలో బోనాలను ఎంతో ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు.

 

Tags :