వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిపాజిట్‌కే వైసీపీ

వచ్చే ఎన్నికల్లో సింగిల్  డిపాజిట్‌కే  వైసీపీ

వచ్చే ఎన్నికల్లో సింగిల్‌ డిపాజిట్‌కే వైసీపీ పరిమితమవుతుందని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా టీడీపీ ఆందోళన నిర్వహించిందన్నారు. ఇక  మున్ముందు ప్రభుత్వ వైఫల్యాన్ని మరింత గట్టిగా ప్రశ్నిస్తామన్నారు. టీడీపీకి బ్యాక్‌ బోన్‌గా ఉన్న బీసీ నేతలను చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు. అయ్యన్న ఇంటిని అర్ధరాత్రి కూల్చడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే అక్రమ కేసులు పెడతారా? అని నిలదీశారు.  గడపగడపకూ వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు చీ కొడుతున్నారన్నారు.

 

Tags :