నోరు పారేసుకోవడం ఏమాత్రం సరికాదు.. చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ ఫైర్

నోరు పారేసుకోవడం ఏమాత్రం సరికాదు.. చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మాటలు నీఛంగా ఉంటున్నాయని అన్నారు. చంద్రబాబు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని, సహనం కోల్పోయి అలా మాట్లాడటం సరికాదని సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సామాన్యుడికి కూడా సరైన న్యాయం జరగాలంటే సీఎం సీట్‌లో జగనే ఉండాలని పేర్కొన్నారు. ప్రజలు వైసీపీ పార్టీతోనే ఉన్నారని, చంద్రబాబు కపట మాటలు నమ్మే రోజులు పోయాయని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు నోరు పారేసుకోవడం ఏ మాత్రం సరికాదని, మాటలు మాట్లాడటం తమకూ వచ్చని, కానీ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మాట్లాడటం లేదని తెలిపారు. పబ్లిసిటీ కోసమే చంద్రబాబు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, అలా మాట్లాడాల్సిన అవసరం తమకు లేదని, ప్రజలకు తాము ఏమీ నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత లేదని, తమ ప్రభుత్వం చేసిన పనులను చెప్తే సరిపోతుందని అన్నారు. కానీ చంద్రబాబు తన పాలనలో ఎటువంటి అవినీతి, అక్రమాలు జరగలేదని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, రాష్ట్రంలో చంద్రబాబు చేసిన అవినీతులు, అక్రమాలు అన్నీ ప్రజలకు తెలిపోయేసరికి చంద్రబాబు తన ఉనికి కోసం తాపత్రయ పడుతున్నారని విమర్శించారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.