సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. జీఎస్టీపై

సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. జీఎస్టీపై

జీఎస్‌టీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జీఎస్టీ కౌన్సిల్‌ సిఫార్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పార్లమెంట్‌, రాష్ట్రాల అసెంబ్లీలు కావాలనుకుంటే వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చని తెలిపింది. పన్నుల విషయంలో 246 ఏ ప్రకారం కేంద్రం, రాష్ట్రం సమానమని, ఒకరి ఆదేశాలను మరొకరిపై బలవంతంగా రుద్దొద్దని జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. కేంద్ర, రాష్ట్రాలకు సమాన అధికారాలున్నాయని చెబుతూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు అవసరమని సూచించింది.

 

Tags :